Thu Dec 26 2024 17:56:14 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : తెలుసుకో తమ్ముడూ..అలాగే ఉంటది మరి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ధర్మమంటే ఇదే తెలుసుకో తమ్ముడూ అంటూ ఆయన అన్నారు. చంద్రబాబు పొత్తు ధర్మం ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ కు సూచించారు.
ట్వీట్ చేస్తూ...
పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. పవన్ కూడా రెండు సీట్లను ప్రకటించారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తున్నట్లు తెలిపి క్యాడర్ లో జోష్ నింపారు. దీనిపై అంబటి రాంబాబు సెటైరికల్ గా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Next Story