Thu Apr 10 2025 19:51:35 GMT+0000 (Coordinated Universal Time)
స్లాట్ బుకింగ్ ను ప్రారంభించిన మంత్రి అనగాని
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలివిడతలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వస్తుందని మంత్రి తెలిపారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులో దశలవారీగా ప్రారంభిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
సత్వర న్యాయం ....
పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుదన్న మంత్రి, వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు సులభతర విధానాలు తీసుకొస్తున్నామని, ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు తన అభిప్రాయం తెలియజేశారు.
Next Story