Mon Dec 15 2025 04:10:05 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై మంత్రి బాలినేని ఫైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలకు ఒకసారి పవన్ పొత్తులు మారుస్తున్నారన్నారు. అది పవన్ కు అలవాటుగా మారిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికి రెండుసార్లు ఎన్నికలు జరిగితే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్, 2019 ఎన్నికల్లో కమ్యునిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే పవన్ టీడీపీతో పొత్తుకు దిగలేదన్నారు.
సీఎం అయితే ఓకే గాని.....
2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్దమయ్యారని మంత్రి అన్నారు. సీఎం పదవి ఇస్తామంటే పవన్ పొత్తు పెట్టుకున్నా ఒక అర్థముందని, చంద్రబాబును సీఎం చేయడానికి పొత్తు ఎందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఒక ఎన్నికల్లో ఎవరినో ఒకరిని తిట్టడం తర్వాత వారినే పొగడటం పవన్ కల్యాణ్ రాజకీయం అని అన్నారు. పవన్ పై ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
Next Story

