Sun Dec 22 2024 12:25:59 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు నేను ఇచ్చే అసైన్ మెంట్ ఇదే : మంత్రి బొత్స కౌంటర్
తాను పవన్ కల్యాణ్ వద్ద ట్యూషన్ తీసుకుంటానన్న బొత్స.. అంతకంటే ముందు పవన్ కల్యాణ్ కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ల రిక్రూట్ మెంట్ పై పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. విద్యాశాఖపై విమర్శలు గుప్పిస్తూ చేసిన ట్వీట్ కు.. ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తాను పవన్ కల్యాణ్ వద్ద ట్యూషన్ తీసుకుంటానన్న బొత్స.. అంతకంటే ముందు పవన్ కల్యాణ్ కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. అందుకు ఆయన ముందుగా చెప్పినదానిప్రకారం.. హోమ్ వర్క్ చేయాలని, పవన్ తానిచ్చే మొదటి అసైన్ మెంట్ ఇదేనంటూ ఈ ఏడు పాఠాలను చదవాలని సూచించారు.
1.పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ టెండర్ లకు సంబంధించినంత వరకూ అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమని తెలుసుకోవాలన్నారు.
2.రూ.100 కోట్లకు పైబడిన ఏదైనా ఒక ప్రభుత్వ టెండర్ పరిధిని, అర్హతను ఖరారు చేసేందుకు హైకోర్టు అనుమతితో నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి (జస్టిస్ శివశంకర్ రావు) చేత ఫైనలైజ్ చేయబడుతుంది.
3. టెండర్ స్పెసిఫికేషన్లు పబ్లిక్ డొమైన్ లలో ఉంచుతామని, అలాగే వాటిపై ప్రతి స్పందించేందుకు 21 రోజుల సమయం పడుతుందని మంత్రి బొత్స తెలిపారు. అందుకోసం నియమించిన న్యాయమూర్తి నిర్ణయం తర్వాతే టెండర్ నోటిఫికేషన్ లాక్ అవుతుందన్నారు.
4.టెండర్ల స్పెసిఫికేషన్ లో ప్రపంచంలో న్యాయపరమైన సమీక్ష కలిగిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పుకునేందుకు గర్విస్తున్నామన్నారు. ఈ తరహా విధానంతో కంపెనీలకు సమన్యాయం జరగడమే కాకుండా అవి సక్సెస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందన్నారు.
5.ప్రాథమిక గూగుల్ సెర్చ్ అనేది మీకు ఈ నిర్థిష్ట టెండర్ కోసం ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్న అన్ని కంపెనీల వివరాలను అందిస్తుందని తెలిపారు. (ఆగస్టు 2022 నుంచి పబ్లిక్ డొమైన్ లో ఉంది) కానీ లింక్ ను మళ్లీ ఇవ్వడం వల్ల దానిని మీరు మళ్లీ మిస్ అయ్యే అవకాశం ఉండదన్నారు.
6.ఏపీ విద్యారంగానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ ఫలితాలను చూడగలిగే అత్యంత పారదర్శకమైన విభాగం తమదేనని చెప్పుకోవడానికి గర్విస్తున్నామన్నారు.
7. ప్రతీసారి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మీరు చేసే ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయమని, అది చూసి నాకు కూడా జాలేస్తోందని బొత్స పేర్కొన్నారు. "మీ మెదడులో పదును పెంచేందుకు ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని బొత్స పవన్ కల్యాణ్ కు కౌంటరిస్తూ ట్వీట్ చేశారు.
Next Story