Sun Nov 17 2024 17:23:09 GMT+0000 (Coordinated Universal Time)
అన్నీ తప్పుడు కథనాలే.. బొత్స ఫైర్
తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే విపక్సాలకు అలవాటుగా మారిందన్నారు. తప్పుడు కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏపీలో విద్యుత్తు కోతలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎన్టీపీసీకి, ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవమేనని, అందుకు రెండు రోజులు మాత్రమే ఇబ్బంది తలెత్తిందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
అవగాహన లేకుండా
తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం విద్యత్తు సమస్య ఎక్కడా లేదని, కావాలంటే గ్రామాల్లోకి రావాలని ఆయన సవాల్ విసిరారు. దీంతో పాటు వైఎస్ వివేకా హత్య కేసును రాద్ధాంతం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. చెత్త పన్ను అంటూ గోల చేస్తున్నారని, రోజుకూ రూపాయి, రెండు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పారు.
Next Story