Mon Dec 23 2024 00:01:09 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ప్రశాంత్ కిషోర్ కు బొత్స స్ట్రాంట్ కౌంటర్.. ప్యాకేజీ తీసుకుని
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జనంలో నుంచి వచ్చిన నేత జగన్ అయితే దానికి రివర్స్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారన్నారు. లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా కూడా ప్రశాంత్ కిషోర్ కు తెలియదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ చాలా తప్పు మాట్లాడుతున్నాడని అన్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరూ నమ్మరని అన్న బొత్స సత్యనారాయణ, చంద్రబాబు కోసమే మాట్లాడినట్లుందన్నారు.
లీడర్ అంటే...
లీడర్ అంటే జగన్ మోహన్ రెడ్డి అని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారన్నారు. ఏదైనా మంచి జరిగితేనే ఓటేయమంటున్న జగన్ లీడరా? లేక జగన్ ను విమర్శిస్తూ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో దిగే చంద్రబాబు నాయకుడా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో జగన్ తరుపున పనిచేసినప్పుడు ఆయన లీడర్ అన్న సంగతి ప్రశాంత్ కిషోర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై పీకే ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.
Next Story