Sun Dec 22 2024 23:09:08 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానులపై వెనక్కు తగ్గేదే లేదు
అమరావతి రైతులతో చర్చలు ఎందుకు జరుపుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు
అమరావతి రైతులతో చర్చలు ఎందుకు జరుపుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తాము బిల్లుల్లో మార్పులు చేసేందుకే గతంలో చేసిన బిల్లులను రద్దు చేశామని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరికి భయపడి వెనక్కు తగ్గలేదని, చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. మూడు రాజధానులపై వెనక్కు తగ్గేదే లేదన్నారు.
అందుకే రద్దు....
అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకే పాత చట్టాలను రద్దు చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ఒక ఐదు శాతం మందిని ఒప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించడంపై ప్రభుత్వం ఒక కమిటీ నియమించే అవకాశముంది.
Next Story