Fri Nov 08 2024 11:56:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ EAPSET ఫలితాలు విడుదల.. టాపర్స్ వీరే
ఇంజినీరింగ్ లో నందిగామకు చెందిన చల్ల ఉమేష్ వరుణ్ 158 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా.. హైదరాబాద్ కు..
ఏపీ EAPSET ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ EAPSET 2023 ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1,71,514 (76.32శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 81,203 (89.65శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ లో నందిగామకు చెందిన చల్ల ఉమేష్ వరుణ్ 158 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా.. హైదరాబాద్ కు చెందిన అభినవ్ చౌదరి రెండో స్థానంలో, పిడుగురాళ్లకు చెందిన సాయిదుర్గారెడ్డి మూడో స్థానంలో, తిరుపతికి చెందిన సుజన్ రెడ్డి నాలుగో స్థానంలో, రాజంపేటకు చెందిన యుగేశ్ ఐదవ స్థానంలో నిలిచారు.
అలాగే కాతేరుకు చెందిన బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్ లో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాకుళంకు చెందిన వరుణ్ చక్రవర్తి 2, సికింద్రాబాద్ కు చెందిన రాజ్ కుమార్ 3, చిత్తూరుకు చెందిన సాయ అభినవ్ 4, తెనాలికి చెందిన కార్తికేయ రెడ్డి 5వ ర్యాంకులు సాధించారు. ఏపీ EAPCETకి మొత్తం 3,38,739 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు 2,38,180 మంది నమోదు చేసుకోగా.. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 1,00,559 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.
Next Story