Mon Dec 15 2025 03:54:10 GMT+0000 (Coordinated Universal Time)
చలో విజయవాడపై బొత్స స్పందన ఇదే
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రభుత్వం ఉద్యోగులను ఎక్కడా భయపెట్టలేదని చెప్పారు. ఎవరిపైనా ఒత్తిడి చేయలేదన్నారు. పీఆర్సీపై ఇచ్చిన జీవోను రద్దు చేసే ప్రసక్తి లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే దానిలో కొన్ని సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
దాని వల్ల ఉపయోగం లేదు...
అలాగే అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇప్పుడు బయటపెట్టడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. రోడ్డెక్కి ఆందోళన చేయడం సరికాదని ఆయన కోరారు.
Next Story

