Sun Jan 12 2025 14:57:47 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై న్యాయసలహా తీసుకుంటున్నాం
హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై జగన్ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు వందశాతం కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
మూడు అంశాలు...
నాడు రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ సలహాలు, సూచలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారా? అని మంత్రిబొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఆర్డీఏ చట్టం అమలులో ఉందని, దాని ప్రకారమే ముందుకు వెళతామని చెప్పారు. సమయం, ఖర్చు, నిధులు మూడు అంశాలు దాని అమలుపై ముడిపడి ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఒక సామాజికవర్గం కోసమే అమరావతిని ఎంపిక చేశారన్నారు. మేం దానికి వ్యతికేమని చెప్పారు.
Next Story