Tue Dec 24 2024 13:45:41 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు పూర్తిగా మతి తప్పింది
టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఖాళీగా ఉండటంతోనే ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. దేశరాజకీయాల్లో పనికిమాలినవాడు ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన చంద్రబాబు అని బొత్స అన్నారు. అధికారాన్ని కాపాడుకోసం, రావడం కోసం ఎంతమంది చంకలు నాకావో అందరికీ తెలుసునని బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పని అయిపోయింది.....
బైజూస్ అంటే జ్యూస్ అని చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని, అది హెరిటేజ్ లో దొరికే జ్యూస్ కాదని బొత్స సత్యనారాయణ అన్నారు. నీ పిల్లలు మాత్రం ఇంగ్లీషులో చదువుకోవాలా? పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు వద్దా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని అన్నారు. విజయనగరం వెళ్లి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. వ్యవహారం చూసిన వారికి ఎవరైనా చంద్రబాబు పని అయిపోయిందని అన్పించక తప్పదు అని బొత్స అన్నాారు. విశాఖ అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు.
Next Story