Thu Dec 19 2024 07:12:55 GMT+0000 (Coordinated Universal Time)
Botsa : ఓటమి భయంతోనే దాడులకు తెగపడుతున్నారు
తెలుగుదేశం పార్టీ నేతలు ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు
తెలుగుదేశం పార్టీ నేతలు ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక చోట్ల హింసకు కారణం తెలుగుదేశం పార్టీ నేతలే కారణమని అన్నారు. ఓటమి తప్పదని తెలిసి ఈ దాడులకు పాల్పడుతూ హింస జరిగేలా నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారన్నారు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు.
సంయమనం పాటించండి...
అయితే తమ పార్టీ పూర్తి సంయమనం పాటిస్తుందని తెలిపారు. తాము కన్నెర్ర చేస్తే మరింత హింస చెలరేగుతుందని ఆయన అన్నారు. అయితే తాము హింసకు వ్యతిరేకమని, కార్యకర్తలు ఎవరూ దాడులకు దిగవద్దని ఆయన కోరారు. టీడీపీ నేతలు దగ్గరుండి కార్యకర్తలను పంపిస్తూ ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. పోలీసులకు సహకరించాలన్నదే తమ పార్టీ నిర్ణయమని అన్నారు. తమను అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దని బొత్స కోరారు.
Next Story