Mon Dec 23 2024 13:09:31 GMT+0000 (Coordinated Universal Time)
ముందస్తు ఎన్నికలు రావు
ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు తమకు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారన్నారు
ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు తమకు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారన్నారు. మరో ఐదేళ్లు కూడా తమకు అధికారం ఇస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని అన్నారు. తాము కాపు సామాజికవర్గం ప్రయోజనాల కోసమే ఇటీవల రాజమండ్రిలో సమావేశమయ్యామని, ఎవరి కోసమో కాదని బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు.
ఫేక్ యాత్ర...
అమరావతి రైతులది ఫేక్ యాత్ర అని మంత్రి బొత్స మరోసారి విమర్శించారు. ఆ యాత్రలో రైతులు లేరన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ఇక ముగిసినట్లేనని అన్నారు. అసలైన రైతులు అందులో లేరని బొత్స సత్యనారాయణ అన్నారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు చేస్తున్న యాత్ర అది అని ఆయన మండి పడ్డారు. వికేంద్రీకరణ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని బొత్స తెలిపారు. విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ పాలన మొదలవ్వడం ఖాయమని ఆయన అన్నారు.
Next Story