Mon Dec 23 2024 10:57:21 GMT+0000 (Coordinated Universal Time)
యూజ్ లెస్ ఫెలో అంటూ బొత్స
వైసీపీ కార్యకర్తపై చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీ కార్యకర్తపై చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యూజ్ లెస్ ఫెలో అంటూ మంత్రి మండిపడ్డారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొని కారు ఎక్కిన మంత్రి బొత్స సత్యనారాయణను ఒక నేత ఎమ్మెల్యే కలుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. అప్పుడు బొత్స పక్కనే కలుబండి కూడా ఉన్నారు. దీంతో మంత్రి బొత్స ఆగ్రహానికి గురయ్యారు.
ఎస్ కోట ఎమ్మెల్యేపై....
యూజ్లెస్ ఫెలో... పార్టీలో ఉంటూ ఇలా బహిరంగంగా ఫిర్యాదు చేసుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే తన కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని కోరారు. పార్టీలో ఉంటే ఉండండ.. లేదంటే లేదంటూ బొత్స ఆ నేతపై మండి పడ్డారు. ఎస్ కోట టౌన్ అధ్యక్షుడు రెహమాన్‌పై బొత్స ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు ఎక్కి వెళ్లిపోయారు. దీనినిచిత్రీకరిస్తున్న కెమెరామెన్‌పై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story