Mon Dec 23 2024 14:52:09 GMT+0000 (Coordinated Universal Time)
అప్పులపై బుగ్గన ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయలేదన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చేసిన అప్పులు చాలా తక్కువేనని బుగ్గన తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ కన్నా....
కోవిడ్ సంక్షోభం తర్వాత అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయన్నారు. రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు ఎక్కువగా చేసిందని ఆయన అన్నారు. 2014, 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించిందని, అప్పుడే అప్పులు ఎక్కువ చేశారని బుగ్గన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ద్రవ్యలోటు మూడు శాతంగా తగ్గించామని తెలిపారు. కానీ తెలంగాణలో ద్రవ్యలోటు శాతంగా ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
Next Story