Mon Dec 23 2024 06:04:03 GMT+0000 (Coordinated Universal Time)
2023కల్లా రోడ్ల నిర్మాణం పూర్తి
గత ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లు నిర్మించకుండా వదిలేశారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు
గత ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లు నిర్మించకుండా వదిలేశారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తునిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రోడ్లను కాగితాలమీదనే వేశారన్నారు. తమ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. వేయని రోడ్లపైనే ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుందన్నారు. గతంలో తాను వేసిన రోడ్లపై నడవవద్దని చంద్రబాబు అనలేదా? అని ఆయన ప్రశ్నించారు. మార్చి నెల నాటికి రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నామని తెలిపారు.
బినామీలే బాగుపడాలా?
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు మీకు కన్పించడం లేదా? అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. చంద్రబాబు సింగపూర్ టెక్నాలజీతో వేసిన అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు దుస్థితి గురించి మీరు మాట్లాడరెందుకు? అని ఆయన నిలదీశారు. అమరావతి పేరు చెప్పి లక్షల కోట్ల సంపదను దోచుకున్నారని దాడిశెట్టి రాజా ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు పనిలేకుండా విశాఖ గర్జనపై ట్వీట్లు చేస్తున్నారన్నారని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికి ఆరోజు తాను కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. పన్నుల రూపేణా అన్ని ప్రాంతాల ప్రజలు చెల్లించే సొమ్ముతో మీరు మీ బినామీలే బాగుపడాలా? అని దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. రాష్ట్రంలో 2023 నాటికి రోడ్లన్నింటినీ బాగు చేస్తామని మంత్రి తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు, అచ్చెన్నాయుడులు ఇద్దరూ రాజీనామా చేయగలరా? అని సవాల్ విసిరారు.
Next Story