Mon Dec 23 2024 05:27:18 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు.. వాలంటీర్లందరూ
మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేయించి, వారితో వైసీపీకి ఓటు వేయించాలని ధర్మాన ప్రసాదరావు కోరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీని గెలిపించేందుకు...
వైసీపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. వైసీపీ పట్ల కోపంగా ఉన్నవారు ఓటు వేయకుండా చూడాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో మంత్రి ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు దిశానిర్దేశం మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Next Story