Mon Dec 23 2024 10:49:15 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : అసత్య ప్రచారాలు ఆపండి.. బీజేపీతో అంటకాగేది మీరే
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చుక్కల భూముల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారరు. తమ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయదని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టమన్నారు. అయినా కూడా తమ ప్రభుత్వం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను అమలు చేయదని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తేనే ఆ చట్టం అమలు చేస్తుందన్నారు. అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో లబ్ది పొందాలని విపక్ష పార్టీలు చూస్తున్నాయని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
చుక్కల భూములను...
చుక్కల భూములను పంపిణీ చేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను అమలు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ కోసం రాజధాని అంటూ ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు మరో ప్రచారాన్ని మొదలు పెట్టిందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో తాము కూడా అలాగే అమలు చేస్తామని తెలిపారు. బీజేపీతో అంటకాగే మీరు దానిపై సమాధానం చెప్పాలన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఈ చట్టం విషయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
Next Story