Sun Dec 14 2025 09:58:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వదంతులు నమ్మొద్దు.. వాలంటీర్ల వ్యవస్థపై నిజం ఇదే
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు.ఏపీలో వాలంటీర్ వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.వాలంటీర్లకు టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.వాలంటీర్ల భవిష్యత్తు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నా మంత్రి వాలంటీర్లు ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మి.. భయాందోళనలకు గురికావొద్దని మంత్రి సూచించారు.
కూటమి ప్రతిష్టను దెబ్బతీసేందుకు...
ఇక ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాలంటీర్లను రాజకీయాల కోసం వాడుకున్నది వైసీపీ నేతలేనని ఆరోపించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. బలవంతంగా రాజీనామాలు కూడా చేయించారని గుర్తు చేశారు. రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి వాలంటీర్ల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇలాంటి కథనాలను, వార్తలను నమ్మి భయపడవద్దని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story

