Mon Dec 23 2024 06:46:08 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారు?
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు ఎక్కడకు వెళ్లి దాక్కున్నారని మంత్రి గుడివాడ అమరనాథ్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు ఎక్కడకు వెళ్లి దాక్కున్నారని మంత్రి గుడివాడ అమరనాథ్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై చంద్రబాబు అడ్డంకులు సృష్టించడం ఆపాలని ఆయన కోరారు. అమరావతి పేరుతో చంద్రబాబు పెద్ద స్కామ్ చేశారన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానమని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
పవన్ అమ్ముడుపోయారు...
అమరావతి రైతులు పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. ఐడీ కార్డులు అడిగితే యాత్రను ఆపేసి వెళ్లిపోయారని ఆయన అన్నారు. రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పవన్ ను ప్రజలు ఎవరూ నమ్మబోరని అని ఆయన అన్నారు. ఎనిమిదేళ్లుగా జనసేన వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ వైసీపీ పై విమర్శలు చేస్తున్నారన్నారు.
Next Story