Sun Dec 22 2024 14:52:46 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మాకు గతం కంటే ఒక్క స్థానమైనా ఎక్కువే బ్రదర్.. మీరు తక్కువ కాకుండా చూసుకోండి
ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖామయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు
అప్పుడూ ఇలాగే అన్నారని, ఈసారి కూడా వైసీపీ విజయం ఖామయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు మహాకూటమి కూడా ఇదే రకంగా తప్పుడు ప్రచారం చేసిందని, కానీ ఆరోజు ఏమయిందని గుడివాడ అమర్నాధ్ ప్రశ్నించారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో తిరిగి రిపీట్ కాబోతున్నాయని అమర్నాధ్ జోస్యం చెప్పారు. పోలింగ్ పర్సంటేజీ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్న అంచనాలు నిజం కాదని ఆయన అన్నారు.
మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో...
అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ప్రజలు గట్టిగా కోరుకోబట్టే ఆ స్థాయిలో పోలింగ్ జరిగిందన్నారు. గత ఎన్నికలలో వచ్చిన సీట్లకన్నా ఎక్కువ స్థానాలే ఈసారి వైసీపీ గెలవబోతుందన్నారు. గ్రామీణ ఓటర్లతో పాటు, మహిళలు ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ఈసారి కూడా వైసీపీకి ఏకపక్ష విజయమే లభిస్తుందని, విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని గుడివాడ అమర్నాధ్ తెలిపారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కూడా మంత్రి అన్నారు.
Next Story