Mon Dec 23 2024 02:09:18 GMT+0000 (Coordinated Universal Time)
Amarnadh : మంత్రిగారు బోరున ఏడ్చేశారు... దు:ఖాన్ని ఆపుకోలేక?
మంత్రి గుడివాడ అమర్నాధ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు
మంత్రి గుడివాడ అమర్నాధ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే పార్టీ హైకమాండ్ అనకాపల్లి టిక్కెట్ ను ఈసారి మలసాల భరత్ కుమార్ కు కేటాయించారు. ఆయనను ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ ఇటీవల ప్రకటన కూడా విడుదలయింది. దీంతో మంత్రి అమర్నాధ్ తాను నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని విలపించారు. నియోజకవర్గాన్ని వదిలేసే ముందు ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
కొత్త ఇన్ఛార్జికి...
ఈ సమావేశంలో మంత్రి అమర్నాధ్ కంటతడి పెట్టుకున్నారు. తనను ఆదరించిన అనకాపల్లిని వదిలివెళ్లిపోవాలంటే కష్టంగా ఉందని, అయితే హైకమాండ్ ఆదేశాలను పాటించాల్సిందేనని అమర్ నాధ్ అన్నారు. తనకు అనకాపల్లి వదిలి వెళ్లాలంటే బాధగా ఉందన్న అమర్నాధ్ కొత్త ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ కు సహకరించాలని కోరారు. తనకు సహకరించినట్లే ఆయన గెలుపునకు కూడా కృషి చేయాలని గుడివాడ అమర్నాధ్ కార్యకర్తలను కోరారు.
Next Story