Tue Apr 15 2025 14:50:44 GMT+0000 (Coordinated Universal Time)
గుమ్మనూరి మళ్లీ గాయబ్
ఆలూరు నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రి గుమ్మనూరి జయరాం హాజరు కాలేదు

ఆలూరు నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రి గుమ్మనూరి జయరాం హాజరు కాలేదు. గుమ్మనూరి జయరాంను కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. ఆలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా విరూపాక్షిని నియమించారు. దీంతో కొంతకాలంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. ఆయన బళ్లారిలో ఉంటున్నట్లు తెలిసింది. మొన్న మంత్రివర్గ సమావేశానికి హాజరైన గుమ్మనూరి జయరాం మళ్లీ అందుబాటులో లేకుండా పోయారు.
చర్యలకు...
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కూడా కనిపించడం లేదు. ఆయన ఈరోజు సమావేశానికి రాకపోవడాన్ని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. పార్టీ సమావేశానికి హాజరైన రామసుబ్బారెడ్డి ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీవై రామయ్యను ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశముంది.
Next Story