Mon Dec 23 2024 07:42:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : గుమ్మనూరికి షాకిచ్చిన వైసీపీ.. అసలు సీటు లేకుండా చేసి?
మంత్రి గుమ్మనూరి జయరామ్‌కు వైసీపీ అధినాయకత్వం గట్టి షాక్ ఇచ్చింది.
మంత్రి గుమ్మనూరి జయరామ్‌కు వైసీపీ అధినాయకత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకు కర్నూలు ఎంపీ సీటును కూడా ఇవ్వకూడదని నిర్ణయించింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కర్నూలు మేయర్ బీవై రామయ్య పేరును ఖరారు చేసింది. ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుట్టా రేణుక పేరును ఫైనల్ చేసింది.
కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా...
ఇటీవల జరిగిన మార్పులు, చేర్పులలో మంత్రి గుమ్మనూరి జయరాంను ఆలూరు నియోజకవర్గం నుంచి తప్పించి కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించింది. అయితే అప్పటి నుంచి గుమ్మనూరి జయరాం పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదు. ఆయన వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అర్ధమయి ఆయనను తప్పించి కర్నూలు ఎంపీ స్థానాన్ని బీవై రామయ్యకు కేటాయించింది. దీంతో గుమ్మనూరి జయరాంకు ఇక ఎంపీసీటు కూడా లేనట్లే అని అనుకోవాలి.
Next Story