Mon Dec 23 2024 08:37:02 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుపై కాకాణి విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టం, దరిద్రమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. కుళ్లూ కుట్రలతో పాటు విష రాజకీయాలకు నిలువెత్తు రూపం చంద్రబాబు అని అన్నారు. నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబునాయుడుఅని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శింారు. నయవంచన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు అని అన్నారు.
ఎందుకు ఇవ్వలేకపోయారు?
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కమీషన్లకు కక్కుర్తి పడింది చంద్రబాబే నన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి అప్పుడే నిర్మాణాలు పూర్తయితే, లబ్ధిదారులకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందననారు. నెల్లూరు, సంగం బ్యారేజీల దగ్గర ఫొటోలు దిగే దమ్ముందా? అని చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ నాయత్వంలో చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇల్లిల్లూ తాము తిరుగుతున్నామని, అలా తిరిగే దమ్మూ, ధైర్యం అప్పటి ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు? అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.
Next Story