Mon Dec 23 2024 09:08:02 GMT+0000 (Coordinated Universal Time)
ఇవి చంద్రబాబు చేసిన హత్యలే
చంద్రబాబు అధికార దాహం కారణంగానే కందుకూరు ఘటన జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు
చంద్రబాబు అధికార దాహం కారణంగానే కందుకూరు ఘటన జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నంలో భాగంగా ఇరుకు రోడ్లలో సభలను పెట్టడం కారణంగానే ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఎన్ని పొరపాట్లు చేయకూడదో చంద్రబాబు అన్నీ చేశారన్నారు. ఎనిమిది మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారన్నారు. గతంలోనూ గోదావరి పుష్కరఘాట్ లోనూ ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. నాటి పుష్కరాల్లో 29 మంది మరణించారని, వారి మృతికి చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు.
సిగ్గుపడాలి....
చేసిన పనికి చంద్రబాబు సిగ్గుపడాలని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. జనాలను భ్రమింప చేయడానికి ఇరుకు రోడ్లలో సభను ఏర్పాటు చేశారన్నారు. ఎనిమిది కుటుంబాల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని కాకాణి శాపనార్థాలు పెట్టారు. ఎందుకు నీ సభలకు జనం వస్తారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావని జనం వేలాదిగా సభలకు తరలి వస్తారని కాకాణి నిలదీశారు. ఎనిమిది మంది కుటుంబాలను చంద్రబాబు వీధిన పడేశారన్నారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలు అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
Next Story