Fri Dec 20 2024 12:28:11 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ట్రాప్ లో పడొద్దు.. పవన్ కు నాని సూచన
చంద్రబాబు ట్రాప్ లో పవన్ కల్యాణ్ పడవద్దని మంత్రి కొడాలి నాని సూచించారు. చంద్రబాబు అవసరానికి వాడుకునే వ్యక్తి అని అన్నారు
చంద్రబాబు ట్రాప్ లో పవన్ కల్యాణ్ పడవద్దని మంత్రి కొడాలి నాని సూచించారు. చంద్రబాబు అవసరానికి వాడుకునే వ్యక్తి అని మంత్రి అన్నారు. ఎన్టీఆర్ వారసులను తొక్కేసింది చంద్రబాబేనని కొడాలి నాని ఫైర్ అయ్యారు. చిరంజీవి అంటే జగన్ కు ఎంతో గౌరవమని చెప్పారు. అందుకే ఆయనను కుటుంబ సమేతంగా జగన్ ఆహ్వానించారన్న విషయాన్ని నాని గుర్తు చేశారు. చిరంజీవికి జగన్ వద్ద ఎలాంటి అవమానం జరగలేదని చెప్పారు.
షరతులేమీ లేవు...
భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం తొక్కేసిందని ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని, సినీ పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణమని కొడాలి నాని అన్నారు. అంతకు ముందు రిలీజ్ అయిన అఖండ, బంగర్రాజు సినిమాల తరహాలోనే ప్రభుత్వం వ్యవహరించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కుల, మత ధ్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నిత్యం ప్రయత్నిస్తారని కొడాలి నాని అన్నారు. టిక్కెట్ ధరలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Next Story