Fri Dec 20 2024 18:16:05 GMT+0000 (Coordinated Universal Time)
2024 కాదు.. 2034 వరకూ టైం ఇస్తున్నా
మంత్రి పదవి నుంచి తనను తప్పించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి కొడాలి నాని అన్నారు
మంత్రి పదవి నుంచి తనను తప్పించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి కొడాలి నాని అన్నారు. చెత్త కాగితాలు తెచ్చి ఇదిగో ఆధారాలంటూ చెత్తవాగుడు టీడీపీ నేతలు వాగుతున్నారన్నారు. గోవా నుంచి మహిళలు ఎవరి కోసం వచ్చారో ఎవరికి తెలుసునని అన్నారు. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వచ్చి ఉంటారేమోనని కొడాలి నాని అన్నారు. ఎస్ఐ, సీఐగా ఉండి అవినీతి సొమ్ము సంపాదంచిన వారు నన్ను విమర్శలు చేస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో ఉన్నవాళ్లంతా సోదిగాళ్లని ఆయన అన్నారు.
తాను ఆసుపత్రిలో ఉంటే...?
కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే టీడీపీ నేతలు నన్ను టార్గెట్ చేశారన్నారు. కొబ్బరి చిప్పలు, సైకిల్ బెల్లులు అమ్ముకునే బుద్దా వెంకన్న కూడా నన్ను విమర్శించేవాడా? అని నిలదీశారు. ఈ గజ్జి కుక్కల్ని ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. 2024 కాదు 2031 వరకూ టైం ఇస్తున్నానని, తనను అడ్డుకోవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. కల్యాణమండపానికి వీళ్లను రానివ్వకపోతే జరిగినట్లా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి బుద్దా వెంకన్న కాపలా ఉన్నాడా? కొడాలి నాని ప్రశ్నించారు. కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని కొడాలి నాని హెచ్చరించారు. కర్జూరనాయుడు పేరు ఎత్తారంటున్నారని, రాజారెడ్డి పేరు టీడీపీ నేతలు ఎన్ని వందల సార్లు అన్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. యాక్షన్ కు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
- Tags
- kodali nani
- tdp
Next Story