Fri Dec 20 2024 18:01:03 GMT+0000 (Coordinated Universal Time)
బాబుపై కొడాలి నాని మరోమారు శాపనార్థాలు
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే కనీసం తెలుగుదేశం పార్టీ అభినందించకపోవడం విచారకరమని మంత్రి కొడాలి నాని అన్నారు
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే కనీసం తెలుగుదేశం పార్టీ అభినందించకపోవడం విచారకరమని మంత్రి కొడాలి నాని అన్నారు. దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీని ఏపీ ప్రజలు ఇక నమ్మరని అన్నారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరు పెట్టారని కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ పాలనను మరిపించే విధంగా జగన్ పేద ప్రజలకు అండగా నిలుస్తారని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని పాలాభిషేకం చేశారు.
టీడీపీ చీర్ బాయ్స్ ....
చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు. ఆయన, టీడీపీ డబ్బా మీడియాలు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకే ప్రయత్నిస్తారన్నారు. ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టింది చంద్రబాబు కాదా? అని కొడాలి నాని ప్రశ్నించారు. కనీసం టీడీపీకి అభినందించే ఆలోచన కూడా రాకపోవడం విచారకరమన్నారు. టీడీపీ చంద్రబాబు చేతులో రాజకీయ సమాధి అవుతుందని కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబు సొల్లు కబర్లు ఆపి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. జిల్లాల ఏర్పాటులో టీడీపీ సలహాలు ఇస్తే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినందుకు మరోసారి జగన్ కు పాదాభివందనాలు చేస్తున్నట్లు తెలిపారు కొడాలి నాని. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని జయంతి, వర్థంతిరోజును చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతారన్నారు. గుడివాడ ప్రజలు చంద్రబాబు ను నమ్మరన్నారు. చంద్రబాబు చీర్ బాయ్స్ వచ్చి గుడివాడలో హడావిడి చేస్తే ప్రజలు పట్టించుకోరన్నారు. మూడురోజుల్లో క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే గోవాలో ఎంత ఆదాయం వస్తుందని కొడాలి నాని ప్రశ్నించారు. తనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా ఫిర్యాదు చేస్తారన్నారు. వీళ్ల డిస్కో కథలు జగన్ కు నమ్మరన్నారు.
Next Story