Fri Dec 20 2024 12:14:34 GMT+0000 (Coordinated Universal Time)
ఎవర్రా బాబాయ్ ని చంపింది?
వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు
వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం జగన్ లో ప్రవహిస్తుందని చెప్పారు. చంద్రబాబు రక్తంలో సిగ్గూ, శరమూ లేవన్నారు. ఎన్టీఆర్ ను వెనక నుంచి వెన్నుపోటు పొడిచిన వ్కక్తి చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు. జగన్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్నారు. నువ్వెంత? నీ బతుకెంత? కుక్క బతుకు నీది లోకేష్.. సన్నాసి వెధవల్లారా? అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు.
వెన్నుపోటు పొడిచి....
వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొన్న సిగ్గులేని బతుకులు మీవని కొడాలి నాని అన్నారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని గెలిపించుకున్నారన్నారు. దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేయాలని లోకేష్ కు సవాల్ విసిరారు. వైఎస్ వివేకాను చంపి రాజకీయ లబ్ది పొందాల్సిన అవసరం జగన్ కు అవసరం లేదన్నారు. పప్పుగాడు, తుప్పుగాడు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. బాబుకు విజనరీ ఉందా? అని అడిగారు. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడే ఊరుకోబోమని కొడాలి నాని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని కొడాలి నాని అన్నారు.
Next Story