Fri Dec 20 2024 12:28:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై ఏడుపు ఇక ఆపండి
జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆపాలని మంత్రి కొడాలి నాని అన్నారు.
జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆపాలని మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ పై చంద్రబాబు అనుకూల మీడియా ఏడుస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మలో ముఖ్యమంత్రి కాలేరని, ఎల్లో మీడియా ఎన్ని ఫీట్లు చేసినా వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మరని కొడాలి నాని అన్నారు. ప్రతిరోజూ తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేయడానికి ఎల్లోమీడియా ప్రయత్నిస్తుందని కొడాలి నాని ఆరోపించారు.
సీఎంగా చేయాలని...
వచ్చే ఎన్నికలలో చంద్రబాబును సీఎంగా చేయాలని ఎల్లో మీడియా తాపత్రయపడుతుందన్నారు. కాకినాడ పోర్టును వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న బియ్యం లో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తుందన్నారు. బియ్యం ఎగుమతులకు సంబంధించిన వివరాలన్నీ ఆన్ లైన్ ఉంటాయన్నారు కొడాలి నాని. కాకినాడ పోర్టు నుంచి ఏపీ నుంచే కాదని, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి ఎగుమతి అవుతుందని కొడాలి నాని స్పష్టం చేశారు.
Next Story