Fri Dec 20 2024 17:47:15 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు మెనీ మెనీ థ్యాంక్స్.. అందుకే?
ఏపీ సీఎం జగన్ కు మంత్రి కొడాలి నాని థన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ అభిమానుల తరుపున జగన్ కు థ్యాంక్స్ చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి కొడాలి నాని థన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానుల తరుపున జగన్ కు థ్యాంక్స్ చెప్పారు. జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి అన్నారు. పాదయాత్ర సమయంలో నిమ్మకూరు వచ్చిన సందర్భంగా జగన్ ఇచ్చిన హామీ నేడు అమలయిందన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన అభిమానులకు జగన్ పెద్ద వరాన్ని అందించారని కొడాలి నాని అన్నారు.
డప్పాలు కొట్టుకునే వారు....
వైఎస్ మరణించిన ఆరు నెలల్లోనే అప్పటి కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాకు ఆయన పేరు పెట్టిందన్నారు. కానీ ఎన్టీఆర్ పేరును పెట్టేందుకు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేతలకు మనసు రాలేదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రినని, 40 ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే వారు జగన్ ను చూసి సిగ్గు తెచ్చుకుంటే మంచిదని కొడాలి నాని హితవు పలికారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం మరింత గౌరవమిచ్చినట్లయిందని కొడాలి నాని అభిప్రాయపడ్డారు
Next Story