Mon Dec 23 2024 17:33:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని అన్నారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఆగష్టు 15వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు.
చేసిన అప్పులకు...
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడు తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారని, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Next Story