Thu Dec 19 2024 17:42:04 GMT+0000 (Coordinated Universal Time)
రేషన్ కార్డుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కొత్త కార్డులను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు. అనేక మంది దీనిపై ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలు అర్జీలు పెట్టుకున్నా గత, ప్రస్తుత ప్రభుత్వాలు కొత్తరేషన్ కార్డులను మంజూరు చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఏ సంక్షేమ పథకమైనా రేషన్ కార్డుతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వాలు వాటిని పంపిణీ చేయడం నిలిపేశారు.
కొత్త ప్రభుత్వం...
గతంలో జారీ చేసిన రేషన్ కార్డులు మాత్రమే ఇప్పుడు అమలులో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాత్రం ఇందుకు రెడీ అయినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డులను కొత్తవి త్వరలో మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడంతో జనంలో ఆశలు చిగురించాయి. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే అనేక మంది అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో మంత్రి ప్రకటనతో తమకు వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story