Tue Dec 03 2024 17:31:45 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శాసనసభలో మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ప్రకటన చేశారు. మూడు నెలల్లోనే టీసీఎస్ కంపనీ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు.
వేల సంఖ్యలో నిరుద్యోగులు...
దీనివల్ల వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని నారా లోకేష్ అన్నారు. తాను టీసీఎస్ ప్రతినిధులతో టచ్ లో ఉన్నానని, వారు తనకు పదే పదే హామీ ఇచ్చారని, మూడు నెలల్లో తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభిస్తామని టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు చెప్పారని నారా లోకేష్ శాసనసభలో ప్రకటించారు. దీంతో మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ రావడం ఖాయమని శాసనసభ సాక్షిగా మంత్రి లోకేష్ తెలిపారు.
Next Story