Sun Mar 02 2025 22:08:46 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : ఏపీలో నిరుద్యోగులకు నారా లోకేస్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోపే ఉపాధ్యాయులు భర్తీకి చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ తెలిపారు. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన ఆయన ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే 80 శాతం ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని అన్నారు.
ఉపాధ్యాయ సంఘాలతో...
తాము ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం టచ్ లోనే ఉన్నామని, వారి అభిప్రాయాలను కూడా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని నారా లోకేష్ తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల యూనియన్ ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తున్నారన్నారు. త్వరలోనే ట్రాన్సఫర్ యాక్ట్ ను కూడా తీసుకువస్తున్నామని లోకేష్ తెలిపారు.
Next Story