Fri Apr 25 2025 03:01:50 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : రెడ్ బుక్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదేనట
రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేష్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ రెడ్ బుక్ పై స్పందించారు

రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేష్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ రెడ్ బుక్ పై స్పందించారు. ఆయన అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయన్న లోకేష్ మూడో చాప్టర్ కూడా త్వరలోనే తెరుస్తామని తెలిపారు.
మూడో చాప్టర్ కూడా త్వరలో...
చట్టాన్ని ఉల్లంఘించిన వారందరిపై న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు. మూడో చాప్టర్ కూడా త్వరలోనే తెరుచుకుంటుందని ఆయన ఈ సందర్భంగా అప్ డేట్ ను వెల్లడించారు. యువగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్న ఆయన వారందరికీ చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ జగన్ గుడ్ బుక్ తీసుకు వస్తున్నానని చెబుతున్నారని, కానీ ఆ బుక్ లో ఏమి రాయాలో ఆయనకే అర్థం కాకుండా ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
Next Story