Thu Dec 26 2024 08:15:05 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : ఎవరినీ వదిలపెట్టేది లేదు : నారా లోకేష్
రుషికొండ ప్యాలెస్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని ఆయన తెలిపారు
రుషికొండ ప్యాలెస్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని ఆయన తెలిపారు. రుషికొండ గురించి జాతీయ మీడియాలో కథనాలు రావడం చూసి గత ప్రభుత్వం ఎంత దోపిడీకి పాల్పడిందో అర్థమయిందని నారా లోకేష్ అన్నారు. జగన్ దోపిడీ దేశాన్ని దిగ్భ్రాంత్రికి గురిచేసిందన్నారు.
సమగ్ర విచారణను...
గత ప్రభుత్వం చేసిన దోపిడీపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలపెట్టబోమని ఆయన హెచ్చరించారు పేదలు తమ పిల్లలు భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే జగన్ వారి డబ్బుతో ఒక రాజభవనం నిర్మించుకున్నారంటూ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Next Story