Thu Dec 26 2024 08:37:02 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : దాడులు చేసేది వాళ్లే.. ఆరోపించేది వాళ్లే...మంత్రి లోకేష్ కామెంట్స్
రాష్ట్రంలో వైసీపీ నేతలే టీడీపీ నేతలపై దాడులకు దిగుతూ, హత్యలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు
రాష్ట్రంలో వైసీపీ నేతలే టీడీపీ నేతలపై దాడులకు దిగుతూ, హత్యలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో చిలూవూరులో మైనారిటీ సోదరుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుతంగా ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకుని తమ పార్టీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగడంలేదని తెలిపారు. వైసీపీ వాళ్లే దాడులు చేస్తూ తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే శాంతియుతంగా ఉన్నామని లోకేష్ అన్నారు.
గంజాయి ని రాష్ట్రంలో...
గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. వంద రోజుల్లో గంజాయిని రాష్ట్రం నుంచి తరిమేయాలని పోలీసులను కోరారు. గంజాయి పై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోం మంత్రిని పార్టీ అధ్యక్షుడిని పోలీసు ఉన్నత అధికారులను కలిసి వివరించానని చెప్ారు. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రుపోందించుకుంటానని తెలిపారు. రుషికొండ లాంటివి రాష్ట్రంలో చాలానే జరిగాయి అన్నిటి మీద నివేదిక వచ్చిన అనంతరం ప్రజల ముందు బహిర్గతం చేస్తామని లోకేష్ తెలిపారు.
Next Story