Sat Mar 15 2025 18:29:20 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన సభపై లోకేశ్ ట్వీట్
జనసేన ఆవిర్భావ సభపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఎక్స్ లో ఆయన స్పందించారు

జనసేన ఆవిర్భావ సభపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఎక్స్ లో ఆయన స్పందించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్, నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు నారా లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన చిత్తుశుద్ధితో పనిచేస్తోందని లోకేశ్ ఎక్స్ లో పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో...
రాష్ట్రాభివృద్ధిలో జనసేన పాత్ర కీలకమన్న లోకేశ్ జనసేనకు ప్రకాశవంతమయిన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. సాధించిన విజయాలు స్మరించుకుందామని, భవిష్యత్‌కు మార్గనిదేశం చేసుకుందామని అంటూనే జయకేతనం అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. జనసేన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story