అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీతో నారా లోకేష్
అమెరికాలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల పర్యటన కొనసాగుతోంది.
అమెరికాలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ... క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ప్రపంచ మార్కెట్ లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో తమ సంస్థ కీలక పాత్ర వహిస్తోందన్నారు. ఎఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు అత్యాధునిక డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా తమ సంస్థ పాత్ర కీలకమైందన్నారు.