Thu Nov 21 2024 12:28:36 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh: అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. లోకేష్ కు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు వస్తారు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని వారు ప్రశంసించారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
విజయం తర్వాత...
ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇన్ చార్జి రవి మందలపు, ఐటి సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీష్ మండవ, సురేష్ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Next Story