Mon Dec 23 2024 10:21:04 GMT+0000 (Coordinated Universal Time)
Nara Brahmini : నారా బ్రాహ్మణి ట్వీట్.. వాళ్ల నోళ్లు మూయించారుగా
మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా బ్రాహ్మణి ఎక్స్ వేదికగా స్పందించారు. అందరూ పల్లెల నుంచి అమెరికా వెళితే.. అక్కడ చదవిన లోకేష్ పల్లె గడపలకు వచ్చారన్నారు. సిమెంట్ రోడ్లు, ఎల్ఈడీ లైట్ల వెలుగులతో వాటి రూపు రేఖలను మార్చారాని నారా బ్రాహ్మణి తెలిపారు.
పనిలో పడి...
ఈ సందర్భంగా లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించారని, వ్యక్తిత్వ హననంచేసిన వారికి నువ్వేంటో తెలియజెప్పావని ట్వీట్ చేశారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావని, కుటుంబ పరంగా మా అందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని నారా బ్రాహ్మణి అన్నారు.
Next Story