Sat Apr 12 2025 09:21:48 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రయాగ్ రాజ్ వెళ్లిన మంత్రి నారాయణ
ప్రస్తుతం ప్రయాగ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి నారాయణ, అధికారులు అక్కడకు వెళ్లారు

గోదావరి పుష్కలు 2027 లో జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రయాగ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి నారాయణ, అధికారులు అక్కడకు వెళ్లారు. కోట్లాది మంది భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అధ్యయనం చేసేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం ప్రయాగ రాజ్ లో పర్యటిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రెండు రోజుల పాటు మహాకుంభమేళా ఏర్పాట్లు అధ్యయనానికి మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్,రాజహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వెళ్ళారు.
అక్కడి ఏర్పాట్లపై...
కుంభమేళా కోసం ఎప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది? ఎంత మందికి ఏర్పాట్లు చేశారు? భక్తుల రద్దీ నిర్వహణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు గురించి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అక్కడి అధికారులు వీరికి వివరించారు. అక్కడి నుంచి మంత్రి బృందం మహా కుంభమేళా అధారిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న మంత్రి బృందం అక్కడి ఏర్పాట్లు పరిశీలించింది. మొత్తం మహా కుంభమేళా జరిగే ప్రాంతాన్ని ఇక్కడి నుంచే మానిటర్ చేయనున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ తగిన అదేశాలివ్వడం,భద్రతా చర్యలు,ట్రాఫిక్ నివారణపై ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూం నుంచి తగిన అదేశాలిస్తున్నట్లు అక్కడి పోలీసు అధికారులు వివరించారు.
Next Story