Sat Mar 15 2025 00:50:28 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నిమ్మల
పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు కృషితోనే పోలవరానికి నేటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 5,052 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఈ నిధులతో డీ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు సకాలంలో పూర్తి చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్రం తొలి, 2వ విడత అడ్వాన్సులుగా నిధులు విడుదల చేస్తోందని చెప్పారు.
పనులు పూర్తి కావచ్చాయంటూ...
136 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు. తెలిపారు. ఏప్రిల్ మొదటివారం నుంచి డీ వాల్ నిర్మాణానికి 3వ కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందన్న ఆయన నిర్వాసితుల ఖాతాల్లో ఒకే విడతలో 990 కోట్లు జమ చేస్లీబనా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్రమిచ్చిన నిధుల్ని గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు.
Next Story