Mon Dec 23 2024 18:14:26 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ సైకో పాలన నీది
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా చంద్రబాబు విమర్శలు చేయడం మానుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ లో 14 ఏళ్ల పాటు సైకో పాలన నడిచిందని మంత్రి పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
వచ్చే ఎన్నికల్లోనూ....
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. 151 సీట్ల కంటే ఎక్కువ ఈసారి వైసీపీకి వస్తాయన్నారు. ప్రజల దృష్టిలో జగన్ పాలన సంక్షేమ పాలన అని, కానీ చంద్రబాబు దృష్టిలో సైకో పాలన అని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు బినామీలు ఇప్పటికే రంగంలోకి దిగారని, చందాలు వేసుకుని మరీ చంద్రబాబును ఈసారి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని, కానీ వారి ప్రయత్నాలు సఫలం కావని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు ఖాయమని అన్నారు.
Next Story