Mon Dec 23 2024 18:21:52 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో పోటీ చేస్తా.. నువ్వు పుంగనూరుకు వస్తావా?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం ఆదేశిస్తే తాను కుప్పంలో పోటీ చేయడానికి సిద్ధమన్నారు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పై పోటీ చేయాలని ఆదేశిస్తే తాను కుప్పంలో పోటీ చేయడానికి సిద్ధమన్నారు. అలాగే చంద్రబాబు కూడా తనపై పుంగనూరులో పోటీ చేస్తారా? అని సవాల్ విసిరారు. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. పండగ పూట కూడా రాజకీయాలు చేస్తూ కలుషితం చేయాలని ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ప్రజలు తిరస్కరించిన...
చంద్రబాబును రాజకీయంగా ప్రజలు ఎప్పుడో అణగదొక్కారన్నారు. తనపై పుంగనూరులో పోట చేస్తే చంద్రబాబుకు డిపాజిట్ కూడా రావడం కష్టమేనని అన్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఒక స్థానం వచ్చిందని, ఈసారి అది కూడా రావడం కష్టమేనని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబును చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. 24 గంటలూ రాజకీయాలు చేయడమే చంద్రబాబు పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.
Next Story