Mon Dec 23 2024 01:54:08 GMT+0000 (Coordinated Universal Time)
వార్డు సచివాలయంలోనూ విద్యుత్తు ఫిర్యాదులు
ఇక పై గ్రామ వార్డు సచివాలయం లో కూడా విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు
ఇక పై గ్రామ వార్డు సచివాలయం లో కూడా విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ లో పోర్టల్ ను రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే... ఈ ఏడాది 248 మిలియన్ యూనిట్లు అందించామని తెలిపారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక నిదర్శమన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
నిరంతర శ్రమతోనే...
అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని, మరింత బాధ్యతతో పని చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. గ్రామ, వార్డ్ సచివాలయంలో ఫిర్యాదులు కోసం పోర్టల్ ప్రారంభించామని తెలిపారు. రైతులను, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగపడుతుందన్న పెద్దిరెడ్డి ఇంతకముందు 45 సేవలు అందిస్తున్నామని, తాజాగా మరో 12 సేవలు చేర్చామని చెప్పారు. సచివాలయంలో ఫిర్యాదు ద్వారా స్థానికంగా ఉండే అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.
Next Story