Thu Dec 26 2024 13:56:39 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ఓటమిని కుప్పంలోనే మేం చూడాలి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో ఈసారి తనను ఓడిస్తానని శపథం చేయడంపై పెద్దిరెడ్డి స్పందించారు. పుంగనూరులో టీడీపీకి అభ్యర్థి కూడా లేడని, ఎవరిని పెట్టి గెలుస్తారని పెద్దిరెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. తాను మళ్లీ కుప్పం నుంచి పోటీచేస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై పెద్దిరెడ్డి స్వాగతించారు. తాము కూడా చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నామన్నారు.
కుప్పంలో ఓటమిని....
అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుని చంద్రబాబు ఓటమిని కుప్పంలో చూడాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఖచ్చితంగా ఈసారి ఓడిపోతాడని, అందుకే ఆయన పారిపోకూడదనే తాము కోరుకున్నామని పెద్దిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మతిభ్రమించి ఏదోదో మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు.
Next Story