Sun Dec 29 2024 01:50:24 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదా అంశం రద్దుపై పేర్ని నాని ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మంత్రి పేర్ని నాని మరోసారి మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మంత్రి పేర్ని నాని మరోసారి మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో చేర్చినప్పుడు చంద్రబాబు ఏమీ మాట్లాడలేదన్నారు. కానీ తొలగించడానికి మాత్రం చంద్రబాబు కృషి చేశారన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సాయంతో ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పక్కన పెట్టిందన్నారు.
జీవీఎల్ వల్ల అదే ఉపయోగం...
టీడీపీ, బీజేపీలు కలసి ప్రత్యేక హోదాపై డ్రామాలాడుతున్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. గోతికాడ గుంటనక్కల్లా చేరి అజెండాను మార్చారన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇప్పడు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి జీవీఎల్ కృషి చేయడు కాని, ప్రత్యేక హోదాను రద్దు చేయడానికి ప్రత్యేకంగా పనిచేస్తాడని పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం జీవీఎల్ కు, సోము వీర్రాజుకు ఇష్టం ఉందా? లేదా? చెప్పాలన్నారు.
Next Story